టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.
ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలు అయ్యాయి.సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కొందరు చిరంజీవి వల్లే స్క్రిప్ట్ అంతా ఇలా అయిందని, చిరంజీవి కొరటాల శివ ను తీయనివ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం దర్శకుడు కొరటాల శివ వల్లే ఈ సినిమా ఇలా అయింది అని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాను మరీ దారుణంగా నాసిరకంగా తీయడం పై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అంతే కాకుండా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో చిరు ఫేస్ నవ్వుకునే విధంగా ఉంది అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు.
అయితే మరోవైపు సినిమా సక్సెస్ అయ్యింది అని చిత్రబృందం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.ఇదే విషయంపై అభిమానులు స్పందిస్తూ ఇలాంటి చెత్త సినిమా తీసింది కాక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు కొరటాల కెరీర్‌లో మొదటి ఫ్లాప్ వచ్చిందని అంటున్నారు.ఈ సినిమా తరువాత దర్శకుడు ఎన్టీఆర్ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ సినిమా టాక్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కచ్చితంగా భయపడి ఉంటారు.అందుకే ఈ రోజంతా కూడా ఆచార్యతో పాటు ఎన్టీఆర్ 30వ సినిమా పేరు కూడా నెట్టింట్లో మార్మోగిపోయింది.
మరి ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమాను చేస్తారా లేకపోతే మరొక ప్రాజెక్ట్ ఎంచుకుంటారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.







