ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ లను తగ్గించిన కారణంగా గత కొన్ని నెలలుగా టాలీవుడ్ సినిమాలు ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే.సినిమా థియేటర్ పై సీజ్ తో పాటు పలు సమస్యలని టాలీవుడ్ ఏపీలో ఎదుర్కొంటుంది.
అలాగే వైసిపి కి చెందిన ఎమ్మెల్యే ఒకరు తెలుగు సినీ నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య దూరం బాగా పెరిగింది.
అయితే అంతకు ముందు ఏపీ ప్రభుత్వ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలం అయ్యాయి.ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అస్సలు తగ్గడం లేదు.
ఇలా అన్ని వ్యవహారాల్లో పవన్ తగ్గకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.పవన్ వైసిపి నేతల మీదనే కాకుండా జగన్ మీద కూడా కామెంట్స్ చేయడంతో టాలీవుడ్ ను టార్గెట్ చేస్తారేమో అని అంతా భయపడ్డారు.
ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యే టాలీవుడ్ నిర్మాతలపై కామెంట్స్ చేయడం బదులుగా వారు కూడా స్పదింస్తు లేఖని విడుదల చేయడంతో వివాదం కాస్త ముదిరింది.ఇక పరిస్థితి చేయదాటేలా ఉందని గమనించిన చిరంజీవి తనకు తానుగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి తో భేటీ కావడం ఆసక్తిని రేపింది.
ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.ఇక మళ్ళీ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులు అందరు కలిసి భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, పోసాని వంటి వారు పాల్గొన్నారు.ఈ భేటీ అనంతరం సీఎం సానుకూలంగా స్పదించారని వీరంతా చెప్పారు.
కానీ తాజాగా బయటకి వచ్చిన వీడియోలో చిరంజీవి సీఎం చేతులు జోడించి వేడుకున్నట్టుగా కనిపిస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ కూడా మండిపడ్డారు.
ఇంతలా ప్రాధేయ పడడం ఎందుకని విమర్శలు గుప్పించారు.
చిరు తాజా వీడియోపై ఇండస్ట్రీలో చాలా మంది పెదవి విరుస్తున్నారు.తమ్ముడు పవన్ తగ్గేదే లే అంటుంటే.అన్న ఏమో తగ్గిపాయే అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
పవన్ విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంటే అన్న ఎందుకు తగ్గుతున్నాడు అన్నది మాత్రం ఎవ్వరికి అర్ధం అవ్వడం లేదు.ఇక మెగా ఫ్యాన్స్ అయితే అన్నదమ్ముల మధ్యలో నలిగి పోతున్నారు.
ఎవ్వరికి సపోర్ట్ చేయాలో అర్ధం అవ్వడం లేదు.