ఆ విషయంలో అల్లు వారసులతో మెగా వారసులు పోటీ పడుతున్నారా?

అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ పోటీ పడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్ లో వీరి కుటుంబాల మధ్య జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే ఇదే నిజం అనిపిస్తుంది.

అయితే ఈ రెండు కుటుంబాలకు బిజినెస్ పరంగా మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ పెద్ద దిక్కుగా నిలిచారు.మెగా కుటుంబంలో ఏది జరిగిన దాని వెనుక అల్లు అరవింద్ హ్యాండ్ ఉండేది.

కానీ ఇప్పుడు యువతరం వచ్చాక ఎవరిదీ వారు అన్నట్టు ఉంటున్నారు.అల్లు అరవింద్ బన్నీ వాసు తో కలిసి గీతా ఆర్ట్స్ 2 స్టార్ట్ చేసాడు.

ఆ తర్వాత రామ్ చరణ్ దానికి పోటీగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేసాడు.అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై చిన్న చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాడు.

Advertisement

కానీ చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హై బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాడు.దీంతో ఇప్పుడు ఎవరి బిజినెస్ వారిది అయ్యింది.

ఇక అల్లు అరవింద్ ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు బాబీ ఇటీవలే రంగంలోకి దిగారు.ఈయన మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక రెండవ కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరోగా కొనసాగుతూనే మరొక వైపు తన తండ్రి స్టార్ట్ చేసిన ఆహా ఓటిటి ని విస్తరించే పనిలో ఉన్నాడు.ఇక మిగిలింది అల్లు శిరీష్.

ఈయన కూడా సినిమాలు చేస్తూనే మరొక వైపు ముంబైలో బిజినెస్ లు చూసుకుంటున్నాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

దీంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ బిజినెస్ పరంగా పోటీ ఇవ్వలేక పోతున్నారు.ఇదిలా ఉంటే కొత్త కొత్త బిజినెస్ లలోకి చిరంజీవి తనయుడు రామ్ చరణ్, కూతుర్లు శ్రీజ, సుస్మిత ఎంట్రీ ఇచ్చేసారు.సుస్మిత కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఓటిటి కోసం వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.

Advertisement

ఇక శ్రీజ రామ్ చరణ్ కు అండగా ఉంటూ బ్రాండ్ లకు సంబంధించిన విషయాలు చూసు కుంటుంది.దీంతో మెగా ఫ్యామిలీ ఎలాగైనా అల్లు ఫ్యామిలీని బిజినెస్ పరంగా బీట్ చేయాలని చూస్తున్నారు.

తాజా వార్తలు