2014లో జనసేన పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన కుటుంబ సభ్యుల మద్దతు ఏరూపం లోనూ తీసుకోవడం లేదు .మెగా కుటుంబ ఆర్దిక సామర్ధ్యానికి ఒక న్యూస్ చానెల్ పెట్టి ఉంటే జనసేన కు( Janasena ) అదీ చాలా ప్లస్ అయ్యి ఉండేదని అభిమానులు ఎంత ఆశించినా పవన్ దానికి ఇస్టపడలేదు అని చెప్తారు .
మెగా కుటుంబం నుంచి నాగబాబు ఒక్కరే జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు.చెప్పుకోవడానికి పది మందికి పైగానే హీరోలు ఉన్నప్పటికీ వారు ఏ విధమైన ప్రచారం కానీ జనసేనకు అనుకూలంగా స్టేట్మెంట్లు కానీ ఇవ్వలేదు.
పార్టీకి సేవ చేయడానికి వారు అనుకూలంగా ఉన్నప్పటికీ సినిమా రంగంలో చాలా భవిష్యత్తు ఉన్న ఈ హీరోలు రాజకీయంగా మాట్లాడితే అనవసరమైన వివాదాల చెల్లరేగుతాయన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వారిని వారించారని పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా రాజకీయాన్ని పూర్తిగా తానే నడిపిస్తానని, మీ అవసరం వచ్చినప్పుడు చెప్తానని బాబాయి చెప్పడం వల్లే సైలెంట్ గా ఉన్నామంటూ రామ్ చరణ్( Ram Charan ) కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.అయితే 2024 ఎన్నికలు జనసేన పార్టీకి చాలా కీలకం అయినందున ఈసారి ఎన్నికల్లో మెగా ప్రచారం కచ్చితంగా ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి.తన వారాహి యాత్రతో( Varahi Yatra ) పొలిటికల్ మైలేజ్ ను పెంచుకున్న పవన్ కచ్చితంగా ఈ సారి అసెంబ్లీ కి తనతో పాటు కొంత మంది అభ్యర్థులను నడిపించాల్సి ఉంటుంది .అప్పుడే వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటు లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.జనసేన పొలిటికల్ దూకుడుకు మెగా ప్రచారం కూడా కలిసి వస్తే జనసేన పార్టీకి మరింత ఊపు వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇబ్బంది పడుతున్న కుటుంబం ఈసారి ప్రచారంలో వాటికి బదులు చెప్పే అవకాశం కూడా ఉందని, మెగాస్టార్( Megastar Chiranjeevi ) లాంటి శక్తి తమ్ముడికి అనుకూలంగా ఒక ప్రెస్ మీట్ పెడితే దాని ప్రభావం వేరేలా ఉంటుంది .అయితే ప్రజారాజ్యం అనుభవాలతో చాలా గుణపాఠలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలని ఇప్పటికీ ఆలోచిస్తున్నారని అయితే ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ పరిస్థితులు మారితే కనక కచ్చితంగా మెగా కుటుంబాన్ని జనసేనలో చూడవచ్చు అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.







