వీరసింహారెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన మెగా డైరెక్టర్!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఫుల్ ఫామ్ లో ఉంది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ ఈ వయసులో కూడా ఫుల్ ఫామ్ లో వరుస హిట్స్ తో ఆకట్టు కుంటున్నారు.

 Mega Director Best Wishes To Nandamuri Balakrishna Veera Simha Reddy Details, Nb-TeluguStop.com

అలాగే వరుస సినిమాలను లాక్ చేసి ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నారు.ప్రెజెంట్ వీరిద్దరూ కూడా మాస్ యాక్షన్ సినిమాలను చేస్తున్నారు.

మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో 154వ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇక బాలయ్య అఖండ సూపర్ హిట్ తర్వాత బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్నాడు.

గోపీచంద్ కూడా క్రాక్ వంటి కిరాక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అందుకే అటు బాలయ్య ఇటు గోపీచంద్ మలినేని ఇద్దరు కూడా విజయాన్ని కొనసాగించాలని తహతహ లాడుతున్నారు.

ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం ఈ సినిమా టైటిల్ లాంచ్ చేసిన విషయం విదితమే.వీరసింహ రెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేసాయి.

ఇంత పవర్ ఫుల్ టైటిల్ కు అంతే పవర్ ఫుల్ రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టైటిల్ అండ్ సినిమాపై మెగాస్టార్ డైరెక్టర్ బాబీ కూడా స్పందించారు.

Telugu Bobby, Nbk, Shruti Haasan-Movie

వీరసింహ రెడ్డి టైటిల్ సూపర్ గా ఉందని.నా బ్రదర్ గోపీచంద్ మలినేనికి అలాగే బాలయ్య గారికి ఇంకా చిత్ర యూనిట్ మొత్తానికి నా నుండి బెస్ట్ విషెష్ తెలియ జేస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో మెగా డైరెక్టర్ బాలయ్య సినిమాకు విషెష్ చెప్పడం ఆసక్తిగా మారింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube