ఆ వివాదాలపై నోరు విప్పిన మెగా డాటర్ నిహారిక.. అలా చెబితే కొట్టేస్తా అంటూ?

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా మెగా డాటర్ నిహారిక వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

వెబ్ మీడియా, సోషల్ మీడియాలో నిహారిక గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి.

నిహారిక సైతం వివాదాలకు, మీడియాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఒక న్యూస్ ఛానల్ కు నిహారిక తల్లి పద్మజ, నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో పద్మజ, నిహారిక ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.నిహారికపై వార్తలు వచ్చిన సమయంలో మొదట కాస్త బాధగా అనిపించిందని ఆమె తెలిపారు.

మాకున్న దానిలో ఎవరూ ఏమీ చేయలేరని అలా అంటే తలుపులు వేసుకొని ఉండాలని ఆమె తెలిపారు.తప్పు చేయని పక్షంలో బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

నిహారిక ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఏదైనా అన్నా బాధ అనిపించని మేం ఏంటో మాకు తెలుసని ఆమె తెలిపారు.

ఎప్పుడైనా ఎవరైనా బాగున్నారంటే వాళ్లపై రాయి వేయాలని వాళ్ల మనసును బాధ పెట్టాలని చూస్తుంటారని ఆమె చెప్పుకొచ్చారు.మా బావగారు ఉన్నంత వరకు మాకేం పరవాలేదని పద్మజ పేర్కొన్నారు.నిహారిక భర్త కూడా ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి అని పద్మజ చెప్పుకొచ్చారు.

నిహారిక ఆ వార్తల గురించి స్పందిస్తూ తాను వార్తలను అస్సలు చూడనని కామెంట్లు చేశారు.యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తాను చూడనని ఆమె తెలిపారు.ఇన్ స్టాగ్రామ్ లో వచ్చే కామెంట్లను అస్సలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు.

నాపై ఎన్నైనా రాసుకోండని నాకు ఏ మాత్రం ఫరక్ పడదని ఆమె చెప్పుకొచ్చారు.ఎవరూ నా ముఖం మీదకు వచ్చి చెప్పరని ఒకవేళ చెబితే మేం కొట్టేస్తాం అని ఆమె తెలిపారు.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

నిహారిక చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు