చిరంజీవి( Chiranjeevi ) స్టార్ హీరోగా ఇండస్ట్రీ లో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సాధించుకున్న తర్వాత తన చుట్టూ ఉండే వాళ్ళను పైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో భాగంగానే గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేసి ఆయన ను కూడా టాప్ ప్రొడ్యూసర్ గా మార్చాడు.
అలాగే పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరోగా చేసి తన తమ్ముడికి కూడా ఒక పెద్ద లైఫ్ ను ఇచ్చాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్( Allu Arjun ) ని మొదటగా ఇండస్ట్రీ కి తీసుకు వచ్చింది కూడా చిరంజీవి గారే కావడం విశేషం…
ఇక ఆ తర్వాత కూడా ఆర్య సినిమా విషయంలో అల్లు అరవింద్ కొంచెం మొండిగా వ్యవహరించినప్పటికీ చిరంజీవి దగ్గరుండి మరి ఆ సినిమాని పట్టాలెక్కించాడు.ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు.చిరంజీవి అల్లు అర్జున్ ను హీరోగా చేస్తే అతన్ని స్టార్ హీరోగా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారనే చెప్పాలి.
ఇక అల్లు అర్జున్ ప్రతి సినిమా ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ అటెండ్ అయి ఆ సినిమాకి ప్రమోషన్స్ చేస్తూ ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర వహించాడు.
ఇక అలాగే పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్ తో చెప్పి దేశముదురు ( Desamuduru )లాంటి సినిమాని కూడా అల్లు అర్జున్ తో తీసేలా చేశాడు.ఇక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో చెప్పి జులాయి( Julayi ) లాంటి సినిమాని ఆయన చేత తీయించాడు.పవన్ కళ్యాణ్ కూడా కెరియర్ ని బిల్డ్ చేయడంలో ఆయన చాలావరకు కీలక పాత్ర అయితే వహించాడు.
ఇక మొత్తానికైతే మెగా బ్రదర్స్ ఇద్దరు అల్లుఅర్జున్ ని స్టార్ హీరోను చేశారనే చెప్పాలి…
.