హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ నేతల భేటీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన రెబల్స్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.

ఈ మేరకు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ నేతలు భేటీ అయ్యారు.

తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే రెబల్స్ ను బుజ్జగిస్తున్న నేతలు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తోంది.

అయితే రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.కీలక నియోజకవర్గాల్లో గెలుపుపై అధిక ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా బుజ్జగింపులు ప్రక్రియను ఏఐసీసీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?
Advertisement

తాజా వార్తలు