సీనియర్ హీరోయిన్ అందాల ఆరబోత.. అమ్మడికి ఎంత కలిసొచ్చింది?

మీరా జాస్మిన్ఈ మెకు పరిచయాలు అవసరం లేదనే చెప్పాలి.ఎందుకంటే ఈమె గురించి అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు తెలుసు.

ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అప్పట్లో మంచి మంచి పాత్రలను పోషించింది.భద్ర, గోరింటాకు, గుడుంబా శంకర్ వంటి సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది మీరా జాస్మిన్.

మీరా మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధం అవుతుంది.అయితే అప్పట్లో పద్ధతిగా కనిపించిన మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం హాట్ హాట్ ఫోజులతో అలరించడానికి సిద్ధం అయ్యింది.

కానీ ఈమెకు ట్రెడిషనల్ గా అయితే ఇప్పుడు అలా ఉంటే అవకాశాలు రావడం కష్టం.అందుకే ఈ పోటీ ప్రపంచంలో తాను కూడా నిలదొక్కు కోవడానికి ఇప్పుడు అందాలు ఆరబోయక తప్పడం లేదు.

Advertisement

ఈమె ఎప్పటి కప్పుడు షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కోసం బరువు కూడా తగ్గి నాజూకుగా మారిపోయింది.

గత కొన్ని రోజులుగా ఫుల్ మేకోవర్ అయ్యి అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాను సైతం వేడెక్కిస్తుంది.అయితే ఈమె అందాల ప్రదర్శన వర్కౌట్ అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

గతంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈమెకు ఛాన్స్ ఇచ్చినట్టు టాక్ వినిపించింది. బోయపాటి రామ్ పోతినేనితో చేయబోయే సినిమాలో మీరా జాస్మిన్ కు అవకాశం ఇచ్చినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.ఇక ఇప్పుడు ఈ అమ్మడు పేరు మరో సినిమాలో కూడా వినిపిస్తుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఈ సీనియర్ హీరోయిన్ ను అనుకుంటున్నారట.మీరా జాస్మిన్ స్టైలిష్ మేకోవర్ కారణంగా ఈమెకు ఈ అవకాశం లభించిందట.

Advertisement

మరి ఈ అవకాశం నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.మొత్తానికి మీరా జాస్మిన్ మేకోవర్ వర్క్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది.

తాజా వార్తలు