మగ పిల్లలు పుట్టడానికి ట్యాబ్లెట్స్‌ వచ్చాయ

కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా కూడా కొందరు అత్యంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.ముఖ్యంగా భారత దేశంలో ఉత్తరాది వారు మగ పిల్లల కోసం ప్రాకులాడుతున్నారు.

గర్బంలో ఉన్న శిషువు ఆడపిల్ల అని తెలిస్తే నలిపేసే అత్యంత క్రూరమైన మనుషులు ఇంకా ఉన్నారని చెప్పడానికి బాధగా ఉంది.ఇండియాలో అబార్షన్స్‌ చట్టరీత్యా నేరం.

ప్రెగ్నెన్సీ సమయంలో స్కానింగ్‌ చేసి లింగ నిర్ధారణ చేయడం అనేది చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తారు.కాని ప్రతి చోట లింగ నిర్ధారణ అనేది చాలా కామన్‌ అయ్యింది.

లింగ నిర్ధారణ పరీక్ష చేయించి అమ్మాయి అయితే అబార్షన్‌ చేయిస్తున్నారు.ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది ఆడపిల్లలను పుట్టక ముందే చంపేస్తున్నారని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.మగ పిల్లలు కావాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

మూడ నమ్మకాలు పాటిస్తూ మగ పిల్లల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.కొందరు ప్రెగ్నెన్సీ రాగానే ఆకు పసరు తాగడం వల్ల అబ్బాయి పుడతాడనే నమ్మకంతో తాగుతున్నారు.

మరి కొందరు ప్రెగ్నెన్సీకి ముందు నుండే నాటు వైధ్యం తీసుకుంటూ అబ్బాయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు అబ్బాయి పుట్టేందుకు ట్యాబ్లెట్లు వచ్చాయంటూ ప్రచారం జరుగుతుంది.ఒకసారి మహిళ గర్బవతి అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ మార్పిడి అనేది జరగదు.ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆడపిల్ల కడుపులో మగ పిల్లాడిగా మారి బయటకు రారు.

కాని ఇది గుర్తించని జనాలు అత్యంత మూడ నమ్మకంతో ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

స్త్రీలలో ఒకే ఒక్క క్రోమోజోమ్‌ ఉంటుంది, అది ఎక్స్‌.ఇక పురుషుల్లో ఎక్స్‌ మరియు వై క్రోమోజోమ్స్‌ ఉంటాయి.ఎక్స్‌ మరియు ఎక్స్‌ కలిస్తే ఆడపిల్ల, ఎక్స్‌ మరియు వై కలిస్తే మగపిల్లాడు పుడతారు.

Advertisement

అందుకే పురుషుల్లో వై క్రోమోజోమ్స్‌ను అధికంగా పెంచేందుకు మందులు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.శృంగారంకు కొన్ని గంటల ముందు ఆ మందులు వేసుకోవడం వల్ల వై క్రోమోజోమ్స్‌ బాగా పెరుగుతాయని తద్వారా అబ్బాయి పుడతాడని అంటున్నారు.

ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం.ఇందులో కనీసం 1 శాతం కూడా నిజం లేదని డాక్టర్లు కొట్టి పారేస్తున్నారు.అసలు క్రోమోజోమ్స్‌ను పెంచే ట్యాబ్లెట్స్‌ ఉండవని, అవన్ని కేవలం పుకార్లు మాత్రమే అంటూ డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ప్రచారంను నమ్మి మోసపోవద్దంటున్నారు.ఎవరైనా అలాంటి ట్యాబ్లెట్స్‌ ఉన్నాయని ఇచ్చినా కూడా వారు మోసం చేస్తున్నట్లుగా గుర్తించాలని డాక్టర్లు చెబుతున్నారు.

తాజా వార్తలు