తెలంగాణలో వైద్య విప్లవం వచ్చింది.ఈ మేరకు రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వైద్య వ్యవస్థను పటిష్టంగా తయారు చేశామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు.ఇందులో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాయని చెప్పారు.
ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థితికి తెలంగాణ చేరిందని తెలిపారు.ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ తెలంగాణ ముందుకు వెళ్తోందన్న కేసీఆర్ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు.ఆదివాసీ జిల్లాల్లోనూ వైద్య విప్లవం తీసుకొచ్చామన్నారు.2014 తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 34 వేల పడకలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.నీతి ఆయోగ్ ర్యాంకింగ్ లో దేశంలోనే తెలంగాణది మూడో ర్యాంకు అని గుర్తు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయని కేసీఆర్ వెల్లడించారు.