పోషకాహార పెరటి తోటల పెంపకంలో యాజమాన్య పద్ధతులు..!

పోషకాహార పెరటి తోటల పెంపకం( Nutritional Backyard Gardening ) వల్ల కూరగాయలను, పండ్లను సంవత్సరం పొడుగునా ఇంటిల్లిపాది తినడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు.సేంద్రియ ఎరువులకు( Organic Fertilizers ) ప్రాధాన్యం ఇస్తే నాణ్యత గల కూరగాయలను తిని కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.

 Measures To Be Taken In Cultivation Of Nutritional Backyard Gardening Details,-TeluguStop.com

పైగా మార్కెట్లో లభించే కూరగాయల కన్నా పెరటి తోటలలో పండే కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి.పెరటి తోటల పెంపకం శారీరక వ్యాయామానికి చక్కటి ప్రత్యామ్నాయం.

మంచినీటి వసతి కలిగి బాగా సూర్యరశ్మి తగిలే అనువైన నేలను ఎంపిక చేసుకోవాలి.కుటుంబంలో ఐదు లేదా ఆరు మంది ఉంటే 220 స్థలం అవసరం.

పెరటి తోట దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే మంచిది.తోటలలో మునగా లేదా కరివేపాకు లాంటి మొక్కలను ఒక మూలన నాటుకోవాలి.ఈ మొక్కల నీడ ఇతర మొక్కల మీద పడకుండా అంతర సాగుకు అడ్డు రాకుండా నాటుకోవాలి.నర్సరీలో( Nursery ) పెంచిన నారుమడిలో తయారుచేసిన తోటలో నాటినప్పుడు మూడు నుండి నాలుగు వాలార వరకు కావలసిన నీటి మోతాదు తగ్గును.

మడులను ఎత్తుగా చేసుకోవడం వల్ల నీరు నిలువ ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది.నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.పైగా మట్టి త్వరగా గట్టిపడకుండా కలుపు యాజమాన్యం తేలికగా ఉంటుంది.

సేంద్రియ మరియు ఖనిజాలు కలిసిన ఎరువులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.సహజ సేంద్రియ పదార్థాలు వాడడం వలన నేలలోని పోషకాలు( Soil Fertility ) పుష్కలంగా ఉండడంతో పాటు మట్టిని పుష్టిగా ఉంచడానికి ఖనిజాల వనాల లోపల పోషక వ్యాధులను నివారించవచ్చు.సేంద్రియ ఎరువు పెరటిలోని ఆకు అలము మరియు వంట చేసినప్పుడు వచ్చే కూరగాయల వ్యక్తపదార్థాలతో తయారు చేసుకోవచ్చు.

పెరటి తోటలో ఒకవైపున కంపోస్ట్ గుంతను ఏర్పాటు చేసుకొని ఆ ఎరువును మొక్కలకు అందించడం వల్ల నాణ్యత గల పంట చేతికి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube