అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 ) షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో పుష్ప 2 నుండి ఆసక్తికర అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా టీజర్ లేదా స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.కానీ పండుగ సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు ఇంకా 11 నెలల సమయం ఉంది.కనుక ఇప్పటి నుండే ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే సుకుమార్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అన్నట్లుగా పేర్కొన్నాడు.అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న పుష్ప 2 సినిమా విడుదల అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప సినిమా తో జాతీయ అవార్డు ని దక్కించుకున్న విషయం తెల్సిందే.అందుకే అల్లు అర్జున్ పుష్ప 2 తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ సుకుమార్ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సుకుమార్( Sukumar ) సినిమా షూటింగ్ ను శరవేగంగా చేయకుండా మెల్లగా ఏమాత్రం టెన్షన్ లేకుండా చేస్తున్నాడు.కనుక సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తి చేస్తాడో తెలియడం లేదు.
ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతుంది కనుక జూన్ జులై వరకు షూటింగ్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.పుష్ప 2 సినిమా విడుదల విషయం లో ఇన్నాళ్లు ఉన్న కన్ఫ్యూజన్ కి సుకుమార్ తెర దించడం తో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.