ఈ బ్రోకలీ పంట( Broccoli Crop ) క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి పంటల కుటుంబానికి చెందిన పంట.బ్రోకలీ చూడడానికి కాస్త క్యాబేజీ లాగే కనిపిస్తుంది.
కాకపోతే దీని పువ్వు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది.శీతల ప్రదేశాలలో ఈ పంట చాలా బాగా పెరుగుతుంది.
బ్రోకలీ అధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ రెండవ దేశంగా ఉంది.ఈ బ్రోకలీ పంట సాగుకు చల్లని తేమతో కూడిన వాతావరణం అవసరం.
అధిక ఉష్ణోగ్రతలు ఉంటే ఈ పంటను సాగు చేయలేం.ఉష్ణోగ్రత 17 నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటే ఈ పంటకు చాలా అంటే చాలా అనుకూలం.
ఈ పంటను ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు నాటుకోవచ్చు.మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
ఒక ఎకరం పొలంలో సాగు చేయడానికి 500 గ్రాముల విత్తనాల అవసరం.ఈ పంట సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే అధిక పోషక ఎరువులను అందించాలి.
ఒక ఎకరం పొలానికి 20 టన్నుల కూలిపోయిన వర్మీ కంపోస్ట్( Vermi Compost ) ఎరువు తో పాటు 100 కిలోల నత్రజని, 75 కిలోల భాస్వరం, 50 కిలోల పోటాష్ ఎరువులు వేయాలి.నత్రజని ఎరువును ఒకేసారి కాకుండా రెండు సమభాగాలుగా చేసి, పంట నాటే సమయంలో ఒకసారి నాటిన నెల రోజుల తర్వాత మరోసారి వెయ్యాలి.ప్రధాన పొలంలో మొక్కలు( Plants ) నాటుకోవడానికి ముందు
2.5 లీటర్ల పెండిమిథలిన్ ను ఒక హెక్టార్ పొలంలో పిచికారి చేస్తే కలుపు సమస్య( Weeds Problem ) తక్కువగా ఉంటుంది.ఆ తర్వాత ఒకటి లేదా రెండు సార్లు కూలీలతో కలుపు తీపించాలి.ఈ పంటకు పది రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.పంటను గమనిస్తూ ఉంటూ ఎప్పటికప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించి మంచి లాభం పొందవచ్చు.