తన రూటే సపరేట్ అంటున్న మాయావతి

దేశంలోని ప్రదాన రాజకీయ పార్టీలన్నీ అటు ఇండియా కూటమి( INDIA ) వైపో లేక ఎన్డీఏ కూటమి( NDA ) వైపో చేరిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఏ కూటమి లోకి చేరకుండా ఉన్న పార్టీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సిపి, టిడిపి, తెలంగాణ నుంచి బారాస ,ఉత్తరప్రదేశ్ నుంచి బహుజన సమాజ్ పార్టీ, బిజూ జనతా దళ్ మాత్రమే .

రెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తున్నాయి.

అయితే ఈ పార్టీలన్నీ కేవలం భాజపాకు అంతిమంగా లబ్ధి చేకూర్చడం కోసమే విడిగా పోటీ చేస్తున్నాయని ఆయా రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకతను చీల్చి అంతిమంగా దాని ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయని బిజెపికి బీ టీం లాగా మారిపోయాయి అని ప్రచారం జరుగుతుంది.

అయితే తాము ఈ రెండు కుటమిలకూ దూరంగా ఉంది సొంతం గా పోటీ చేస్తామని ప్రకటించారు మాయావతి.( Mayawati ) ఈ రెండు కూటములు కూడా కులతత్వం మతతత్వ భావనలతో నిండిపోయాయని, పెట్టుబడుదారి అనుకూల విధానాలను అవలంబిస్తున్నాయని ,వర్గ పోరును ప్రోత్సహిస్తాయని ఇలాంటి కూటమి లో చేరాల్సిన అవసరం లేదంటూ ఆమె తేల్చేశారు.మొదటి నుంచి ఈ విధానాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ ఆ కూటములలో ఎందుకు చేరుతుందని తనతో పొత్తు కోసం ఎదురుచూసి ఇప్పుడు తమను బిజెపి బి టీం అని విమర్శించడం సరికాదంటూ ఆమె ఆగ్రహించారు.

అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగావిపక్షాల తీరు ఉందంటూ ఆమె ఫైర్ అయ్యారు.2017 ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ( BSP ) 2022 ఎన్నికలలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది.ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో( Uttar Pradesh ) తమ ప్రభావాన్ని క్రమంగా కోల్పోతున్న ఈ పార్టీ భాజాపా తో లోపాయికారి ఒప్పందాలతోనే భాజపాకు( BJP ) అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి.

Advertisement

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ మిజోరం వంటి రాష్ట్రాలలో పోటీ చేసి అక్కడ దళిత మైనారిటీల ఓటింగ్ చీల్చి భాజాపాకు ఉపయోగపడే బీ టీం లా తయారైందని ఈ పార్టీపై ఉన్న ప్రదాన ఆరోపణ.ఇప్పుడు వాటన్నింటినీ ఖండిస్తున్న మాయావతి మరోసారి తాము రాజకీయాల్లోక్రియాశీలక పాత్ర పోషించ బోతున్నట్టుగా చెప్పుకొచ్చారు .

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు