టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ( Raviteja ) గురించి మనందరికీ తెలిసిందే.ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు రవితేజ.నేడు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.అందులో భాగంగానే రవితేజ ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి ఆ వివరాల్లోకి వెళితే.
మొదట్లో పలువురు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలను పోషించాడు.ఈ క్రమంలోనే సింధూరం అనే చిత్రంలో అదిరిపోయే పాత్రతో హైలైట్ అయ్యాడు.
ఆ తర్వాత కూడా సహాయ నటుడిగా నటించాడు.దీంతో రవితేజకు మంచి గుర్తింపు కూడా లభించింది.
ఇక నీకోసం సినిమా( Neekosam )తో హీరోగా మారిన విషయం తెలిసిందే.ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రవితేజ.
అలా తన కెరియర్లో ఎన్నో హిట్లు ప్లాప్స్ చవిచూసారు రవితేజ.అలా ఎన్నో సినిమాలలో నటించి భారీగానే సంపాదించుకున్నారు రవితేజ.
ఇక క్రాక్ సినిమా వరకు 10 నుంచి 12 కోట్ల రెమ్యూనరేషన్( Raviteja Remuneration ) అందుకున్న రవితేజ ఒక్కొక్క సినిమాకు 20 కోట్లు తీసుకుంటున్నాడట.ప్రస్తుతం రవితేజకు రూ.150 కోట్లు నికర విలువ ఉన్నట్లు సమాచారం.అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ.30 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట.అలాగే, దాదాపు రూ.6 కోట్లు విలువైన కార్లు, రూ.2 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ.50 కోట్లు విలువైన ఫ్లాట్లు( Raviteja Properties ) ఉన్నాయట.వీటిలో ఆయన భార్య కల్యాణీ పేరుతో సగానికి పైగా రాసినట్లు తెలుస్తోంది.