పనోడి మోజులో పడ్డ భార్య.. చివరికి కట్టుకున్న భర్తనే

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక వ్యవహారాన్ని చూస్తున్నట్లయితే సభ్య సమాజం ఎటువైపు పోతుందో  చెప్పలేని దుస్థితి ఏర్పడింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ మహిళ అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తని తిరిగి రాని  లోకానికి వీడ్కోలు తెలిపింది.

వివరాల్లోకి వస్తే ఏలూరులో లో నివాసం ఉంటున్న గుడిపూడి నాగరాజు మరియు భూలక్ష్మి లకి ఏడేళ్ల కిందట  వివాహమైంది.నాగరాజు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి , పెదపాడు మండలం వట్లూరు సమీపంలో తాపీ పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో నివాసం ఏర్పరుచుకున్నాడు.

నాగరాజుకి పనిలో సహాయం చేయుటకోసం  వట్లూరు గ్రామానికి చెందిన తోకల సురేష్ అనే యువకుడు ప్రతిరోజు వచ్చేవాడు.అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే నాగరాజు మరియు భూలక్ష్మి  దంపతులకు సురేష్ అనే యువకుడు మంచి నమ్మకస్తుడిగా వారి ఇంట్లో వ్యక్తిగా పరిచయాలు ఏర్పడ్డాయి, ఈ పరిచయాలు కాస్త భూలక్ష్మికి మరియు సురేష్ కు వివాహేతర సంబంధగా మారింది.

  ఈ క్రమంలో సురేష్  నాగరాజు లేని సమయంలో తరచు తను ఇంటికి వచ్చి వెళ్లేవాడు ఇది గమనించిన ఇరుగు పొరుగువారు నాగరాజు కు  ఈ విషయాన్ని  తెలుపగా నాగరాజు  ఇది మనసులో ఉంచుకుని   తన భార్యను  ప్రేమగా మందలించి సర్ది చెప్పినప్పటికీ  భూలక్ష్మి భర్త మాటలను పెడచెవిన పెట్టి ప్రియుడితో రాసలీలల సాగిస్తోంది. అయితే సురేష్ కుమార్ భూలక్ష్మి సంబంధానికి అడ్డు  వచ్చినటువంటి నాగరాజును ఎలాగైనా తప్పించాలని  ప్లాన్ వేశారు ఇందులో భాగంగా  ఈ నెల 6వ తేదీన నాగరాజు నిద్రపోతున్న సమయంలో భూలక్ష్మి ,సురేష్ కలిసి ఇనుప రాడ్డుతో  నాగరాజు తలపై  బలంగా కొట్టి  చంపేశారు అనంతరం ఉరేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

Advertisement

ఈ ప్రయత్నం  విఫలమవడంతో తెల్లవారితే చుట్టుపక్కల వారందరికీ తెలుస్తుందని భయంతో ఇద్దరు ఊరు వదలిపెట్టి  పారిపోయారు.దీంతో గురువారం ఉదయం నాగరాజు చనిపోయి పడి ఉండడం గమనించినటువంటి ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన ఏలూరు త్రీటౌన్ పరిధిలోకి రాగా  సీఐ మూర్తి సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన  ప్రదేశాన్ని చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  భర్తతో నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో గడపాల్సినటువంటి భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని  భర్తను తిరిగిరాని లోకాలకు పంపినందుకు ఇరుగుపొరుగువారు భూలక్ష్మి మరియు సురేష్ ని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు