బంతిపూల సాగుతో ఆమె జీవితమే మారిపోయింది

బంతిపూల సాగు ఆ మహిళా రైతు జీవితాన్ని మార్చివేసింది, సాగు చేపట్టిన కొన్ని నెలల్లో లక్ష రూపాయల లాభం అందుకుంది.జార్ఖండ్‌లో బంతి పూల సాగుతో తన కుటుంబ ఆర్థికస్థితిగతులను మెరుగుపరుచుకున్న మహిళా రైతుల్లో లిలు దేవి ఒకరు.

 Marigold Flower Farming , Marigold Flower , Farming , Women Farmer , Jharkhand-TeluguStop.com

లీలు దేవి కేవలం కొన్ని వేల రూపాయలతో బంతి పువ్వుల సాగు ప్రారంభించారు.నాలుగు నెలల తర్వాత లక్ష రూపాయలకు పైగా లాభం అందుకున్నారు.

గత రెండేళ్లుగా సంప్రదాయ రీతిలో వరి, టమోటా పంటలను సాగుచేసినా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కస్మార్ బ్లాక్‌లోని ఇతర రైతులతో పాటు లీలు దేవి తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఆ సమయంలో చాలా మంది రైతులు నూతన పంట వేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు బహుళ ధాన్యాల వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది.లిలు కూడా దీనిపై ఆసక్తి చూపారు.దీనికి కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించారు.అనంతరం ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని బంతిపూల సాగు ప్రారంభించారు.

దీంతో పాటు పొలంలో ఆవాల మిశ్రమ సాగు కూడా చేశారు.ఈ ప్రయోగం విజయవంతమైంది.

స్వల్ప కాలంలోనే బంతిపూలు చేతికి వచ్చాయి.మార్కెట్‌లో బంతిపూలకు మంచి డిమాండ్ ఉంది.

అతి తక్కువ ధరకే బంతి నారును కొనుగోలు చేసి, దానిని నాటి స్వల్ప కాలంలోనే బంతిపూలను అందుకుని, వాటిని విక్రయించి లిలు అత్యధిక లాభాలను అందుకుంటున్నారు.పండుగ సమయాల్లో బంతి పూలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube