మార్చి నెలలో పుట్టినవారికి కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది.వీరు ప్రతి విషయంలోనూ తొందర పడుతూ ఉంటారు.
వీరికి గర్వం ఎక్కువగా ఉంటుంది.అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉండుట వలన స్నేహం చేయటం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నది.
ఈ నెలలో పుట్టినవారు గొప్ప రాజకీయ నాయుకులు అవుతారు.వీరికి ప్రేమ,దయ తక్కువగా ఉండటమే కాకుండా సాటి వారికి ఎటువంటి సాయం చేయటానికి సిద్ధంగా ఉండరు.
వీరు ఎదుటివారిని అసలు లెక్కచేయరు.అలాగే గొప్పలు కూడా ఎక్కువే.
గొప్ప గొప్ప అలోచనాలను చేసి వాటిని అమలు చేయటంలో విజయం సాధిస్తారు.
వీరికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది.
అలాగే వీరు ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకుంటారు.అయితే వీరు భాద్యత గల స్థానములో ఉంటారు.
వీరికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం.దీని మూలముగా వీరు బయట సమాజములోనూ, అయిన వారితోనూ చివరకు తన సంసారము లోనూ సమస్యలు కోరి కొని తెచ్చుకుంటారు.
కొన్ని సందర్బాలలో వీరు సంసారమును కూడా వదిలి పెట్టె పరిస్థితులు రావచ్చు.వీరు మంచి ఆలోచన పరులు, నిర్మోహటంగా మాట్లాడతారు.
శతృత్వం అనేది వీరి వెంటనే ఉంటుంది.
వీరికి కంటికి సంబందించిన వ్యాధులు, తల నొప్పి ఎక్కువగా వచ్చేఅవకాశము ఉంది.వీరికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.అనుకోకుండా ధన లాభం కలిసి వస్తుంది.
మంచి అభివృద్ధిని పొందుతారు.సుఖపడతారు.
అదృష్టము అనేది వీరికి బాగా కలిసి వస్తుంది.మంగళ వారము, గురువారము మరియు శుక్రవారం అదృష్టం కలిసి వస్తుంది.
వీరికి ఆకుపచ్చ, పసుపు మరియు బంగారు రంగు అదృష్ట రంగులు.పగడము లేదా నీలము ధరిస్తే మంచిది.