యాంకర్ : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హోమ్ మినిస్టర్ టి వనిత, జైపూర్ ఎంపీ ప్రిన్సెస్ దియా కుమారి, నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కన్నడ యాక్టర్ కే జి ఎఫ్ వశిష్ట ఎన్.సింహ, స్వామి వారిని దర్శించుకుని చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.







