చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన మన్సూర్ అలీ ఖాన్.. అలా చేసి ఉంటే బాగుండేదంటూ?

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన నటించిన తాజా చిత్రం లియో.

 Mansoor Ali Khan Allegations On Chiranjeevi In Trisha Issue Details, Mansoor Ali-TeluguStop.com

ఈ సినిమాలో హీరోయిన్ త్రిష( Trisha ) పట్ల ఈయన చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.తాను ఇదివరకు నటించిన పలు సినిమాలలో హీరోయిన్లతో కలిసి రేప్ సన్నివేశాలలో నటించాను.

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ అంటే తనతో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని భావించాను కానీ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేవని ఆమెను రేప్ చేసే అవకాశం తనకు రాలేదు అంటూ అసభ్యకరంగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది సెలబ్రిటీలు త్రిషకు మద్దతు తెలుపుతూ మన్సూర్ అలీ ఖాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Telugu Chiranjeevi, Khushboo, Leo, Mansoorali, Trisha-Movie

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా త్రిషకు మద్దతు తెలియజేస్తూ ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తన పరువుకు భంగం కలిగించారని నిజానిజాలు తెలియకుండా తన గురించి చెడుగా మాట్లాడారు అంటూ మన్సూర్ అలీ ఖాన్ త్రిష చిరంజీవి కుష్బూ పై కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా మరోసారి చిరంజీవి వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చిరంజీవి గారు ప్రతి ఏడాది హీరోయిన్స్ అందరికీ పార్టీ ఇస్తారు.

Telugu Chiranjeevi, Khushboo, Leo, Mansoorali, Trisha-Movie

ఆ పార్టీకి నన్ను ఎప్పుడు పిలవలేదు అనుకోండి అయినా ఆయన కేవలం హీరోయిన్స్ కి మాత్రమే పార్టీలు ఇస్తారు.అది పూర్తిగా ఆయన ఇష్టం కానీ నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు ఏం జరిగింది అనే విషయం గురించి ఒక్కసారి నాకు ఫోన్ చేసి విషయాలను తెలుసుకొని ఉంటే బాగుండేదని అలా కాకుండా చిరంజీవి గారు నా గురించి అలాంటి మాటలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించాయని మాట్లాడారు.ఇక ఈయన పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించారని ఆయన ఒక్కరికి హెల్ప్ చేయలేదని తెలిపారు.ఇక త్రిష కుష్బూ చిరంజీవిపై కేసు పెట్టి పరువు నష్టం దావ( Defamation Case ) ద్వారా వచ్చిన డబ్బుతో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఆ డబ్బును ఇస్తానంటూ ఈ సందర్భంగా మన్సూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube