14 సంవత్సరాలుగా డిన్నర్ చేయని హీరో... ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు ఫిట్నెస్( Fitness ) విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో వారు తీసుకునే ఫుడ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.వారు న్యూట్రిషన్ ఇచ్చే సలహాలు సూచనలు ఆధారంగానే ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు.

 Manoj Bajpayee Stopped Eating Dinner For 14 Years Details, Manoj Bajpayee, Dinne-TeluguStop.com

చాలా తక్కువ మొత్తంలో ఎక్కువ పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ తమను తాము కాపాడుకుంటూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) ఒకరు.

ఈయన  హీరోగా ఎన్నో సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటించి సందడి చేశారు.

Telugu Manoj Bajpayee, Bollywood, Manojbajpayee, Web-Movie

ది ఫ్యామిలీ మెన్( The Family Man ) వెబ్ సిరీస్ ద్వారా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మనోజ్ బాజ్ పాయ్ తన ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టారు.ఐదు పదుల వయసులో ఉన్నటువంటి ఈయన ఇప్పటికీ చాలా ఫిట్, హెల్తీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ వయసులో కూడా ఇంత ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి కారణం ఏంటి అనే విషయాల గురించి ఈయన మాట్లాడుతూ.తాను గత 14 సంవత్సరాలుగా నైట్ భోజనం చేయడం లేదని అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అంటూ చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Manoj Bajpayee, Bollywood, Manojbajpayee, Web-Movie

బరువు పెరగడం, అనారోగ్యాల విషయానికి వస్తే ఆహారమే అతిపెద్ద శత్రువు అన్నారు.మీరు రాత్రి భోజనం( Dinner ) చేయడం మానేస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు అనేక అనారోగ్యాలకు కూడా మనం దూరంగా ఉండవచ్చు అని తెలిపారు.నాకు ఫుడ్ తీసుకోవడం చాలా ఇష్టం కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రమక్రమంగా ఫుడ్ తగ్గిస్తూ వచ్చాను అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అసలు 14 సంవత్సరాల పాటు రాత్రి భోజనం చేయకుండా ఉండడం ఎలా సాధ్యమైంది అంటూ ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube