కింగ్ అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మన్మథుడు సినిమా( Manmadhudu Movie ) కూడా ఒకటి.విజయ భాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ అదిరిపోయే డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నాగ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో చాలా థియేటర్లలో ఆ సినిమాకు బదులుగా మన్మథుడు సినిమాను ప్రదర్శించారు.
విచిత్రం ఏంటంటే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా మన్మథుడు మూవీ రీ రిలీజ్ లో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.మొదట ఒకరోజు మాత్రమే ఈ సినిమాను ప్రదర్శించాలని భావించిన థియేటర్ల నిర్వాహకులు ఈ సినిమాకు వచ్చిన మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ను చూసి ఆశ్చర్యపోవడంతో పాటు మన్మథుడు సినిమాను థియేటర్లలో కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

తిరుపతి( Tirupati ) లాంటి చిన్న టౌన్ లలో సైతం ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో మన్మథుడు ఆశ్చర్యపరుస్తోంది.మరోవైపు వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే ఈ సినిమాకు మైనస్ అయింది.వరుణ్ తేజ్( Varun Tej ) చాలా సందర్భాల్లో గాండీవదారి అర్జున మూవీ అద్భుతంగా ఉండనుందని చెప్పుకొచ్చారు.

అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.మన్మథుడు రీ రిలీజ్ దెబ్బకు వరుణ్ తేజ్ మూవీకి థియేటర్లు సైతం కరువయ్యాయి.యంగ్ జనరేషన్ మెగా హీరోలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా( Matka Movie ) అనే సినిమాలో నటిస్తున్నారు.