నాన్న హమాలి తల్లి పాచిపని.. కసితో చదివి సక్సెస్ సాధించిన మనీషా స్టోరీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

జీవితంలో సక్సెస్ సాధించే ముందు చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు.కొంతమంది ఆ అవమానాల వల్ల కెరీర్ పరంగా ఎదగలేక ఆగిపోతే మరి కొందరు మాత్రం ఆ అవమానాలను ఎదుర్కొని, దాటుకుని, ముందడుగులు వేసి కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన మనీష సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.23 సంవత్సరాల క్రితం నల్గొండ నుంచి ఖమ్మం జిల్లా( Khammam District )కు మనీష కుటుంబం వలస వచ్చింది.

మనీష( Manisha ) తండ్రి హమాలి కాగా తల్లి ఫంక్షన్ హాళ్లలో పాచిపని చేసేవారు.తల్లీదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన మనీష తను మంచి ఉద్యోగం సాధించాలని భావించారు.ఒక్క గదిలోనే కుటుంబమంతా జీవనం సాగించేవారు.

పదో తరగతి వరకు ఖమ్మంలో చదువుకున్న మనీషా ఆ తర్వాత వరంగల్ లో చదువుకున్నారు.భద్రాద్రి జోన్ లో సివిల్ ఎస్సై( Civil SI ) కేవలం 50 పోస్టులు మాత్రమే ఉండగా నాకు జాబ్ వస్తుందో రాదో అని భయపడ్డానని ఆమె తెలిపారు.

కసిగా చదివి ఉద్యోగం సాధించానని రేయింబవళ్లు చదివానని మనీష చెప్పుకొచ్చారు.వారాంతపు టెస్ట్ లు, గ్రాండ్ టెస్ట్ లు క్రమం తప్పకుండా రాసి తక్కువ మార్కులు వస్తున్న సబ్జెక్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఆమె తెలిపారు.ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించడంతో సంతోషంగా ఉందని మనీష వెల్లడించారు.

Advertisement

డిగ్రీ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకోవాలని చాలామంది ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు.ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పానని చెప్పిన విధంగానే పెళ్లి చేసుకుంటున్నానని మనీష అన్నారు.

మనీష చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భవిష్యత్తులో మనీష కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థితికి ఎదగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మనీష ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సక్సెస్ సాధించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు