తంబీల కోరిక నెరవేరింది.. బాహుబలి రికార్డ్‌ బ్రేక్‌

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ భారీ బడ్జెట్ చిత్రం పోనియిన్ సెల్వం తమిళనాట 200 కోట్ల భారీ కలెక్షన్స్‌ ని రాబట్టింది.ఈ సినిమా బాహుబలి స్థాయి లో ఉంటుంది అంటూ తమిళ మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా నమ్మకం పెట్టుకున్నారు.

 Maniratnam Ponniyin Selvan Movie Collections , Aishwarya, Film News, Mani Ratnam-TeluguStop.com

కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో రాణించలేక పోయిందని చెప్పాలి.ఇతర భాష ల్లో సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

తమిళం లో మాత్రం మంచి కలెక్షన్స్ నమోదు చేయడం లో సఫలం అయింది.ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా కలెక్షన్స్ తో ఈ సినిమా పోటీ పడుతుందని అంతా భావించారు.

కానీ ఆ స్థాయి లో సినిమా ఉండదని క్లారిటీ వచ్చేసింది.

Telugu Aishwarya, Bahubali, Mani Ratnam, Ponniyin Selvan, Telugu-Movie

తాజాగా ఈ సినిమా తమిళనాట ఏకం గా 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం తో బాహుబలి రికార్డు బ్రేక్ అయింది.ఇటీవల విక్రమ్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా కు మించి ఈ సినిమా కలెక్షన్స్ నమోదు చేయడం తో తమిళనాడు ఆల్ టైం రికార్డ్ నమోదు అయింది.

తమిళం లో మణిరత్నం భారీ మల్టీ స్టారర్ సినిమా రికార్డు బ్రేకింగ్ వసూళ్లని దక్కించుకోవడం తో తమిళ తంబీ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సుదీర్ఘ కాలం తర్వాత తమిళ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం తో ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఓవరాల్‌ గా బాహుబలి స్థాయిలో ఈ సినిమా లేదు.కానీ తమిళ నాట మాత్రం బాహుబలి వసూళ్లను బ్రేక్‌ చేయడం తో పాటు నెం.1 సినిమా గా నిలవడం చర్చనీయాంశం గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube