దసరాకి పొన్నియన్‌ సెల్వన్‌ ను జీరో చేస్తారా పాపం!

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ సినిమా పొన్నియన్ సెల్వన్‌ ఓవరాల్‌ గా చూస్తే ఒక మోస్తరుగా వసూళ్ల ను రాబడుతుంది.తమిళనాడు లో భారీగా ఈ సినిమా కలెక్షన్స్ దక్కించుకుంటుంది.

 Maniratnam Ponniyan Selavan Movie Collections  Maniratnam,  Ponniyan Selavan , C-TeluguStop.com

కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం లో కూడా ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడం తో వసూళ్లు దాదాపుగా లేవనే చెప్పాలి.మొదటి వారం లో బ్రేక్ ఈవెన్‌ సాధ్యం కాదని ఇప్పటికే తేలి పోయింది.

ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అసాధ్యంగానే కనిపిస్తుంది.అందుకు కారణం రెండో వారం నుండి ఈ సినిమా ఆడే అవకాశం కనిపించడం లేదు.

ఎందుకంటే దసరా సందర్భం గా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

అందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ కాగా, రెండవది నాగార్జున నటించిన ది గోస్ట్.

ఈ రెండు సినిమాలు కాకుండా వాటికి పోటీ అన్నట్టు బెల్లంకొండ సాయి గణేష్ హీరో గా నటించిన స్వాతిముత్యం సినిమా కూడా అదే దసరా సందర్భంగా రాబోతుంది.ఈ మూడు సినిమా లు థియేటర్ల విషయం లో కొట్టుకునే అవకాశం ఉంది.

ఇలాంటి సమయం లో వసూళ్లు రాని పొన్నియన్ సెల్వన్‌ సినిమా ని బయ్యర్లు థియేటర్ లో ఉంచే పరిస్థితి లేదు.అందుకే పోనియన్ సెల్వన్‌ సినిమా ని రాబోతున్న సినిమా ల కోసం జీరో చేసే అవకాశం ఉందంటున్నారు.

అంటే పొన్నియన్ సెల్వన్‌ ని థియేటర్ల నుంచి తొలగించే అవకాశం ఉందంటున్నారు.అదే జరిగితే సినిమా కు భారీ నష్టం తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దసరా సందర్భం గా కలెక్షన్స్ పై ఆశ పెట్టుకున్న నిర్మాతలకు అది పెద్ద షాక్ అని చెప్పాలి.ఈ షాక్‌ నుండి పొన్నియన్ సెల్వన్ నిర్మాతలు ఎలా బయటపడతారో ఏమో పాపం… తమిళ స్టార్ హీరో లు విక్రమ్, కార్తి, జయం రవి లు నటించగా ఐశ్వర్య రాయ్,, త్రిష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో రూపొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube