నోటిపూతను నివారించే మామిడి పూత..ఎలా వాడాలంటే?

నోటి పూత‌ పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.

దవడ లోపల, నాలుక‌పైన‌,పెదవుల లోపల, చిగుళ్ల‌పై చిన్న చిన్న పుండ్లు ఏర్ప‌డ‌తాయి.

దీనినే నోటి పూత అంటారు.వేస‌వి కాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీర వేడి, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, జీర్ణ స‌మ‌స్య‌లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోటి పూత ఇబ్బంది పెడుతుంది.నోటి పూత ఏర్ప‌డిన‌ప్పుడు తీవ్ర‌మైన నొప్పి, మంట‌ క‌ల‌గ‌డ‌మే కాద తినేందుకు, తాగేందుకు ఏమైనా మాట్లాడేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

అందుకే నోటి పూత‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు.

Advertisement

అయితే న్యాచుర‌ల్‌గా కూడా నోటి పూత‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా నోటి పూత‌ను త‌గ్గించ‌డంలో మామిడి పూత‌ను అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.సాధార‌ణంగా స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే ఎక్క‌డ చూసినా మామిడి పండ్లే క‌నిపిస్తుంటాయి.మామిడి పండ్లు రుచిగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

ఇక మామిడి పండ్లే కాదు మామిడి పూత కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నోటి పూత స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు.మామిడి పూత‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని మ‌జ్జిగ‌లో క‌లిపి సేవించాలి.ఉద‌యం, సాయంత్రం ఇలా చేస్తే నోటి పూత త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అలాగే మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ మామిడి పూత గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మామిడి పూత‌ను ఎండి బెట్టి పొడి చేసుకుని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి సేవించాలి.

Advertisement

ఇలా ప్ర‌తి రోజు చేస్తే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి.

తాజా వార్తలు