నాలుగు కోట్లతో అమ్మవారి ధనలక్ష్మి అలంకరణ మందలపర్రులో

ఏలూరుజిల్లా నిడమర్రు మండలం మందలపర్రు శ్రీఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీఉమాదేవి అమ్మవారిని 4 కోట్ల రూపాయలు విలువ చేసే కొత్త కరెన్సీనోట్లతో ధనలక్ష్మి అలంకరణ చేశారు.

ఆలయ నిర్వాహకులు సరిపల్లి శంకరం, కృష్ణంరాజు, రామచంద్రరాజులు శ్రీఉమాదేవి అమ్మవారికి క్రొత్త కరెన్సీ నోట్లు 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 మరియు రూపాయి నోట్లతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక నాణేలను అలంకరణలో వినియోగించారు.

ధనలక్ష్మి అలంకారాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

Mandalapur Ammavaru Temple Decorated With New Notes Of More Than 4 Crore Rupees,
స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

తాజా వార్తలు