తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబంలో మంచు కుటుంబం ఒకటి.మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న అడుగు పెట్టారు.
అయితే వీరు సినిమాల కన్నా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం జరుగుతుంటుంది.
అయితే గత కొంతకాలంగా సినిమాలకు సోషల్ మీడియాలకు దూరంగా ఉన్నటువంటి మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత విషయాల గురించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే జనవరి 20 తేదీన తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి తెలియజేయబోతున్నాను అంటూ ఈయన తన సినిమా గురించి ప్రకటించారు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియాలో కులం గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.దీంతో భారీగా నేటిజన్స్ ఈయనని ట్రోల్ చేస్తున్నారు.
మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వారు? అంటూ ఓ ప్రశ్నను లేవనెత్తాడు.బయటకు కనిపించే తీరుతో మనకు ఓ రకమైన గుర్తింపు, గౌరవం వస్తుంది.
డబ్బు, పవర్, అంతస్థులు చూసి మనకు గౌరవం ఇస్తుంటారు.మరికొందరు మంచితనాన్ని చూసి గౌరవిస్తూ ఉంటారు.
ఇందులో మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారు అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా మంచు మనోజ్ ప్రశ్నించడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈయన ప్రశ్నపై స్పందిస్తూ కులాల గురించి మీరే ప్రశ్నించాలి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు హయ్యర్ పర్పస్ గురించి చెప్పిన నువ్వే ఇవన్నీ మాట్లాడుతున్నావా? అంటూ భారీగా తనని ట్రోల్ చేస్తున్నారు.మొత్తానికి మంచు మనోజ్ నెటిజన్ ట్రోలింగ్ కి గురవుతున్నారు.మనోజ్ సినిమాల విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఈయన వాట్ ది ఫిష్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
అలాగే ఈయన తన రెండో పెళ్లి గురించి కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.