మంచు మనోజ్, మంచు విష్ణు( Manchu Manoj, Manchu Vishnu ) మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.మంచు విష్ణుపై ఈ గొడవ విషయంలో ఎక్కువమంది విమర్శలు చేయడం జరిగింది.
మనోజ్, విష్ణు మధ్య గ్యాప్ కు సంబంధించి వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా మనోజ్ ఈ గొడవ గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఒక మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మనోజ్ కు మంచు విష్ణు వీడియో గురించి స్పందించాలనే ప్రశ్న ఎదురైంది.ఇది నన్ను అడగకండని నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసని మనోజ్ అన్నారు వాళ్లనే అడగండని నన్ను అడగొద్దని మనోజ్ కామెంట్లు చేశారు.
నాకు సినిమా అభిమానులే జీవితం అని మనోజ్ చెప్పుకొచ్చారు.సినిమా లేకపోతే నాకు ఏం లేదని మనోజ్ పేర్కొన్నారు.
వాట్ ద ఫిష్ సినిమాతో( What the Fish movie ) త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని మనోజ్ చెప్పుకొచ్చారు.నాకు ఫ్యాన్స్ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.ఇటీవల కొత్త జీవితం మొదలెట్టానని మీ అందరూ ఆశీర్వదించి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నానని మనోజ్ కామెంట్లు చేశారు.మనోజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపై మనోజ్ వరుస సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మనోజ్ కెరీర్( Manoj Career ) విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో మనోజ్ నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మనోజ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.మనోజ్ యాక్టింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.మనోజ్ ఇతర హీరోలతో కలిసి భారీ బడ్జెట్ మల్టీస్టారర్స్ లో నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మనోజ్, విష్ణు గొడవ పడకుండా కలిసి ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు.