టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Hero Manchu Manoj ) గురించి మనందరికీ తెలిసిందే.మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచి మనోజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
మొదట్లో కొన్ని సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు.సోషల్ మీడియా కూడా దూరంగా ఉన్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు మనోజ్.భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy ) విషయం ఎప్పుడైతే ప్రస్తావన వచ్చిందో అప్పటినుంచి తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇది ఇలా ఉంటేనే మనోజ్ మౌనిక ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ జంటకు పండంటి బిడ్డ( Baby Girl ) కూడా జన్మించింది.కూతురి రూపంలో మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అని తెగ సంతోష పడిపోతున్నాడు మంచు మనోజ్.ఏప్రిల్ 13న మనోజ్ భార్య మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటికే మౌనిక కుమారుడు ధైరవ్ బాధ్యతను కూడా మనోజ్ తన భుజాన వేసుకున్నాడు.ఇప్పుడు ధైరవ్‌తో ఆడుకునేందుకు ఒక పాపాయి రావడంతో మంచు ఫ్యామిలీ( Manchuu Family ) మురిసిపోతోంది.
ఆమెకు ఎమ్.ఎమ్.
పులి అని ముద్దుపేరు కూడా పెట్టారు.పాప పుట్టిన పది రోజులకే మనోజ్ మరో పని మొదలుపెట్టాడు.
తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టినట్లు ట్వీట్ చేశాడు.
నా మనసు తిరిగేది ఇక్కడే.ఎంతో ఎండగా ఉన్నా సరే.తిరిగి సెట్‌లో ప్రవేశించినందుకు సంతోషంగా ఉంది.నాకు అన్నింటికంటే బాగా ఇష్టమైన పని చేస్తున్నాను అంటూ సినిమా, ఫిలింస్( Cinema,Films ) అని హ్యాష్ ట్యాగ్ జత చేశాడు.దీన్ని బట్టి మనోజ్.తన సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఇది చూసిన అభిమానులు మీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.
ఇంకొందరు కం బ్యాక్ అదిరిపోవాలన్న సినిమా హిట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.