తన తండ్రి అది గిఫ్ట్ గా ఇచ్చాడంటూ మంచు లక్ష్మి పోస్ట్.. మరి ఏం చేద్దామంటూ కామెంట్స్?

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.లక్ష్మి తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Advertisement

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఇక లక్ష్మి ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా ఆమె మాత్రం ఇంగ్లీష్ సీరియల్స్ లో 2004 నుండి 2008 వరకు వరుసగా నాలుగు సీరియళ్లలో నటించింది.

ఆ తర్వాత మళ్లీ ఇంగ్లీష్ ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక ఆ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ చేసింది.ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.

Advertisement

పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.

ఇటీవలే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియోలు కూడా చూయించింది.అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరలో ఉంది.

అప్పుడప్పుడు వెండితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది మంచు లక్ష్మి.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఒక స్టోరీ పంచుకుంది.అదేంటంటే ఆమె ఒక శాలువా కప్పుకొని ఉండగా.

తన తండ్రి తను వేసుకున్న అందమైన శాలువా గిఫ్ట్ గా ఇచ్చాడు అని తెలిపింది.దీంతో అది చూసిన నెటిజెన్స్ అయితే మాకేంటి అంటూ.

మరి ఏం చేద్దాం అంటావు అంటూ సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు