సాధారణంగా బోనస్ అంటే ఉద్యోగులు ఎంతో సంతోష పడతారు.ఎందుకంటే ఫ్రీ బోనస్ అనేది ఒక నెల జీతానికి లేక రెండు మూడు నెలలకూ సమానమైనది.
అయితే ఒక కంపెనీ మాత్రం ఏకంగా 4 ఏళ్ల శాలరీని ఇయర్లీ బోనస్‌గా ఇస్తామని ప్రకటించి వారి సంతోషానికి అవధుల్లేకుండా చేసింది.వివరాలలోకి వెళితే.
తైవాన్‌కి చెందిన ఎవర్ గ్రీన్ అనే షిప్పింగ్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయ్ జాబ్ గ్రేడ్, తైవాన్ దేశ చట్టాలకు లోబడి కాంట్రాక్టు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తోంది.
ఒక ఏడాది కాలంలో ఎంప్లాయ్ చూపించిన పనితీరు ఆధారంగానే ఈ బోనస్ మొత్తం నిర్ణయించడం జరుగుతుందని కంపెనీ వెల్లడించింది.గత ఏడాది డిసెంబర్ 30న కొంతమంది ఉద్యోగులు 65,000 డాలర్ల (సుమారు రూ.54 లక్షలు) కంటే ఎక్కువ చెల్లింపులు అందుకున్నారని తైపీ ఎకనామిక్ డైలీ న్యూస్ గత వారం నివేదించింది.

ఇంత ఎక్కువగా బోనస్ చేయడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే 2022లో ఈ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగి 20.70 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఆ రేంజ్ లో ఆదాయం వచ్చింది కాబట్టే ఈ కంపెనీ తమ ఉద్యోగులకు కూడా డబ్బులు ఇచ్చి ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలనుంది.ఏదేమైనా ఇలాంటి బోనస్ అందుకున్న ఉద్యోగుల ఆనందం మాటల్లో వర్ణించలేనంత గొప్పగా మారింది.

ఇకపోతే గతేడాది ఈ కంపెనీ చెందిన ఓ షిప్ ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయింది.ఇది నీటి రహదారికే అడ్డంగా కు పోవడం వల్ల అటు ఇటు రెండు వైపులా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అది పెద్ద సమస్యకు దారి తీసింది.ఆ సంఘటనతో ఈ కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియ వచ్చింది.ఇప్పుడు బోనస్‌ల వల్ల ఈ కంపెనీ పేరు మరోసారి తెర పైకి వచ్చింది.







