ఈ రోజున ఇలా ఉన్నానంటే కారణం తానే అంటున్న మంచు లక్ష్మి..!

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ లో మంచు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఇక వారి కుటుంబంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకుంది.

ఓ వైపు సినిమాల్లో, మరోవైపు బుల్లితెరపై తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.అంతేకాదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియా ద్వారా తన కుటుంబానికి సంబంధించిన అప్డేట్స్ తెలుపుతూ.ఎవరికైనా పుట్టిన రోజు లేదా ఏదైనా స్పెషల్ రోజు సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతుంది.

అసలు విషయంలోకి వెళ్తే.తాజాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తన కూతురుతో కలిసి డాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Advertisement

ఈ వీడియోని షేర్ చేస్తూ తన కూతురు విద్య నిర్వాణను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.పిల్లల దినోత్సవం అలాగే దీపావళి పండగ రెండు కలిసి రావడంతో వారి ఇంటిని రంగురంగుల లైట్స్ తో అలంకరించారు.

ఈ సందర్భంగా అలా వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు మంచు లక్ష్మి తన కూతురుతో కలిసి డాన్స్ వేసిన వీడియోను సోషల్ మీడియాతో పంచుకున్నారు.ఈ వీడియో లో భాగంగా ఆవిడ కు తన కూతురి పై ఎంత ప్రేమ ఉందో బయటికి తెలుపుతూ సందేశాన్ని తెలిపింది.

ఇందులో భాగంగానే తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం తన కూతురు అని అందుకే తనకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ తెలిపింది.తాను తల్లిగా ఇంత స్ట్రాంగ్ గా ఉండేందుకు కావాల్సిన శక్తిని ఇచ్చింది తన కూతురు అని తెలిపింది. I love you baby అంటూ నీతో ఇలా ఎంజాయ్ చేస్తునందుకు చాలా సంతోషంగా ఉందని మంచులక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీడియోను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పుడే కాదు ఇది వరకు కూడా ఎన్నో సార్లు తన కూతురే తన సర్వస్వం అంటూ తెలిపింది మంచు లక్ష్మి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

తన కూతురు తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమెని తన జీవితానికి ఓ అందమైన అర్థం అంటూ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు