వైరల్ వీడియో: వీపు దురదగా ఉందని జెసిబి తోనే రుద్దించుకుంటున్న ఘనుడు..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.కొందరు చేసే విచిత్ర విన్యాసాలు, వారి హావభావాలు ఇలా ఏదైనా కొత్తగా ఉంటే అందుకు సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం.

 Man Uses Jcb Loader For Itching, Scratch, Jcb Loader To Scratch His Back, Jcb Lo-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పక్షులు, జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారుతుండటం గమనిస్తూనే ఉన్నాం.ఇక కొంతమంది వారి క్రేజీ ఆలోచనలతో సోషల్ మీడియాలో స్టార్ గా నిలుస్తున్నారు.

ఇలా భారతదేశంలో ఎంతో మంది ఇలా ఫేమస్ అయిన వారు ఎందరో.తాజాగా సోషల్ మీడియాలో మరొక వీడియో వైరల్ గా మారుతోంది.

అసలు ఆ వీడియో లో ఏముందంటే…
ఓ పెద్దాయన జెసిబితో వీపును గోకిచ్చుకోవడం కనపడుతుంది.కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.

మామూలుగా ఎవరైనా దురద అనిపించినప్పుడు చేతగాని లేకపోతే చేతికి ఏదైనా తీసుకొని గాని వీపు భాగాన్ని గోక్కుంటారు.కాకపోతే ఈ వీడియోలో కనిపించే పెద్దాయన మాత్రం కాస్త వెరైటీ… తన వీపుకు దురదగా అనిపించడంతో తన చేతిలో ఉన్న టవల్ తో గోక్కున్న తర్వాత అటు నుంచి కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జెసిబి కిందికి వెళ్ళాడు.

అరే ఏం జరగబోతోందో అని ఆలోచించే సమయానికి ఆ జెసిబి ఆ పెద్దాయన వీపును అటు ఇటు అంటోంది.నిజానికి అది చూడడానికి ఎంతో నవ్వు తెప్పించే విధంగా ఉంది.

వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్స్ ఈ వీడియోకు అనేక రకాలుగా వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఈ పెద్దాయన మామూలోడు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube