Elevator Break Coconut: ఇదేందయ్యా ఇది: ఇలా కూడా కొబ్బరికాయలను పగలగొట్టవచ్చా..?!

కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-వైరల్ లక్షణాలు ఎన్నో అనారోగ్యాలను దూరం చేస్తాయి.

వివిధ రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా గణనీయంగా పెంచుతుంది.

ఇలాంటి కొబ్బరిని నేరుగా తినడమే కాకుండా, కూరల్లోనూ, పచ్చడిగానూ వివిధ రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు.ఈ విషయాలు ఎలా ఉన్నా కొబ్బరికాయను పగులగొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

కొంత మంది కొబ్బరి కాయ పగులగొట్టే సమయంలో దెబ్బలు తగిలించుకుంటుంటారు.కొందరు మాత్రం చాలా నేర్పుగా కొబ్బరికాయను రెండుగా పగులగొడతారు.

Advertisement

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొందరు మాత్రం వెరైటీగా కొబ్బరికాయను పగులగొట్టారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఎవరైనా కొబ్బరి కాయను పగులగొట్టాలనుకుంటే ఏదైనా బండకు వేసి బాదుతారు.లేదా అదే రాయిని తీసుకుని కొబ్బరి కాయపై వేస్తారు.

అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం చాలా వెరైటీగా కొబ్బరికాయను పగులగొట్టారు.

కొబ్బరికాయను ఒక కవర్‌లో చుట్టారు.ఆ కవర్‌ను మరో భాగం లిఫ్ట్ (ఎలివేటర్) లోపలికి పెట్టి ఉంచారు.తర్వాత లిఫ్ట్ పైకి కదిలింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

లిఫ్ట్‌ తో పాటే కొబ్బరికాయ కూడా పైకి వెళ్తూ లిఫ్ట్ పైభాగంలో గట్టిగా ఢీకొంది.ఆ తర్వాత పై నుంచి కొబ్బరికాయ కింద పడి పోయింది.

Advertisement

కింద పడ్డాక రెండు ముక్కలు అయింది.ఇలా కూడా కొబ్బరి కాయ కొడతారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

దీనిని sidfrompune అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది.

తాజా వార్తలు