KIMS liver disease : కిమ్స్ వైద్యులు సాధించిన ఘనత ఇది... ఇండియాలోనే తొలిసారి ఇది!

మనకు తెలిసిందే.సాధారణంగా ఆరోగ్య వంతులలో కాలేయం బరువు 1.5 కిలోలు ఉంటుంది.అయితే ప‌శ్చిమ‌ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వయస్సు గల ఉషా అగ‌ర్వాల్ అనే మహిళ కడుపులో ఉదర భాగాన్ని పొడుచుకు వచ్చిమరీ పేగులను పక్కకు తోసేసి కాలేయం 12 కిలోల మేర పెరిగింది.

 This Is The Achievement Of Kim's Doctors  This Is The First Time In India Kims D-TeluguStop.com

తత్ఫలితంగా ఆమె క‌డుపులోకి విప‌రీతంగా నీరు చేర‌డం, హెర్నియా వంటి సమస్యలు ఏర్పడ‌టంతో న‌డ‌వ‌డం ఆమెకి కష్టతరంగా మారింది.ఇక తాజాగా సదరు మహిళ కడుపులో నుంచి 12 కిలోల బరువున్న కాలేయాన్ని కిమ్స్ వైద్యులు విజయవంతంగా తొలగించి, అరుదైన ఘనత సాధించారు.

ఈ విషయమై కిమ్స్ ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్, చీఫ్ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్, GPB స‌ర్జరీ డాక్టర్ ర‌విచంద్ సిద్దాచారి సదరు వివరాలు వెల్లడించారు.పాలీసిస్టిక్ లివ‌ర్ అండ్ కిడ్నీ డిసీజ్ అనేది జ‌న్యువులలో మ్యుటేష‌న్ వ‌ల్ల ఏర్పడే వంశ‌ పారంప‌ర్య వ్యాధి అని తెలిపారు.

ఇక ఈ సమస్య వలన మూత్ర పిండాలు, కాలేయంలో నీటితిత్తులు (సిస్టులు) ఏర్పడ‌తాయని అన్నారు.అయితే 30ల‌లో ఉన్నంత‌కాలం రోగుల‌కు దీనివ‌ల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, సిస్టులు పెరిగేకొద్దీ వారికి క్రమంగా ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డతాయని అన్నారు.

Telugu Kims Doctors, Liver, Rare, Rare Medical-Latest News - Telugu

ఇక ఆమెగురించి మాట్లాడుతూ భారీ హెర్నియా ఏర్పడి అది కాస్త ప‌గ‌ల‌డంతో అనేక సమస్యలు వచ్చాయని వివరించారు.ఇక క‌న్సల్టెంట్ యూరాల‌జిస్టు, మూత్రపిండాల మార్పిడి శ‌స్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఉమామ‌హేశ్వర‌రావు మాట్లాడుతూ.కాలేయం ఉద‌ర‌భాగం మొత్తాన్ని ఆక్రమించ‌డంతో శ‌స్త్ర చికిత్స చేయ‌డం కత్తిమీద సాములాగా మారిందని, అయితే డాక్టర్ల బృందం ఎంతో శ్రమకోర్చి ఆఖరికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.దానికోసం సుమారు 14 గంటల పాటు శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube