ఈ రోజుల్లో దొంగలు యాపిల్ స్టోర్లపై( Apple Store) ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.ఈ కారణంగా ఇటీవల కాలంలో యాపిల్ ఉత్పత్తులు లేదా సేవల కంటే దొంగతనాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా ఒక యాపిల్ స్టోర్‌లో పడి 40 ఐఫోన్లను కొట్టేసిన దొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ యాప్ టిక్‌టాక్‌లో ఈ వీడియో మొదట పోస్ట్ అయింది.
సాధారణంగా కస్టమర్లు ప్రయత్నించడానికి టేబుల్‌ల మీద యాపిల్ ఐఫోన్లను యాపిల్ స్టోర్‌లో డిస్‌ప్లేకి పెడతారు.అయితే వీటినే ఈ కేటుగాడు చోరీ చేసినట్లు వీడియోలో కనిపించింది.
ఈ వ్యక్తి త్వర త్వరగా ఐఫోన్లను( iPhones ) లాగేసుకుంటూ తన జేబుల్లో కుక్కుకుంటూ మొత్తం 40 దాకా ఐఫోన్లను తీసేసుకున్నాడు అనంతరం దుకాణం నుండి బయటకు పరుగెత్తాడు.

ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీశాడు.దుకాణ ఉద్యోగులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.ఆ వీడియోలో స్టోర్ దగ్గర పార్క్ చేసిన పోలీసు కారు కూడా ఉంది.
దీంతో పోలీసులు దొంగను( Thief ) ఎందుకు పట్టుకోలేదో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో ఎక్స్, ఇతర సైట్‌లలో విస్తృతంగా వైరలయ్యింది.అతడు దొంగతనం చేసిన యాపిల్ స్టోర్ కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో( Oakland ) ఉందని కొందరు ఇంటర్నెట్ యూజర్లు తెలిపారు.అయితే ఓక్‌ల్యాండ్‌లో యాపిల్ స్టోర్‌లు లేవని స్థానిక వార్తా సైట్ ది ఇవిల్లే ఐ తెలిపింది.
సమీప యాపిల్ దుకాణాలు శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ఇతర నగరాల్లో ఉన్నాయి.

ఓక్లాండ్‌లో నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయి.ఇన్-ఎన్-అవుట్ బర్గర్, డెన్నీస్ వంటి కొన్ని రెస్టారెంట్లు బంద్ కూడా అయ్యాయి.మరోవైపు యాపిల్ స్టోర్లు, ఇతర షాపులను టార్గెట్ చేస్తున్న దొంగలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గతంలో బర్కిలీ యాపిల్ స్టోర్ నుంచి 75 ఐఫోన్లను దొంగిలించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.బర్కిలీ యాపిల్ స్టోర్ ఓక్‌లాండ్‌కు సమీపంలోని మరొక నగరంలో ఉంది.ఇతర పోలీసు శాఖల సహాయంతో దొంగలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.దొంగిలించిన ఐఫోన్‌లను తిరిగి పొందామని కూడా చెప్పారు.







