తాజాగా కువైట్ బీచ్ లో( Kuwait Beach ) ఓ థ్రిల్లింగ్ ఘటన చోటు చేసుకుంది.ఇక్కడ ఓ వ్యక్తి బీచ్ ఇసుకపై పెద్ద కారుతో స్టంట్స్( Car Stunts ) చేస్తూ ఎంజాయ్ చేశాడు.

అయితే దురదృష్టవశాత్తు కారు అదుపుతప్పింది.అది పల్టీలు కొడుతూ దారుణంగా డ్యామేజ్ అయింది.
ఈ ప్రమాదం నుంచి సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియో ప్రకారం ఒక వ్యక్తి కువైట్ లోని ఒక బీచ్ లో కారు నడుపుతున్నాడు.
ఆ క్రమంలోనే కారు ఇసుకలో చిక్కుకుని, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.కారు హఠాత్తుగా పల్టీలు కొట్టి, చాలాసార్లు దొర్లింది.
ఆ సమయంలో అతను కారులో నుంచి బయటికి విసిరి వేయబడ్డాడు.అద్భుతంగా, ఈ డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి డ్రైవర్ అదృష్టవంతుడని చాలా మంది అభిప్రాయపడ్డారు.కొందరు డ్రైవర్ సీటు బెల్ట్( Seat Belt ) ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు.ఈ వీడియోకు వేలల్లో లైక్స్ వచ్చాయి.కువైట్ లోని అబూ అల్-హసనియా బీచ్ లో ఈ కారు బోల్తా పడిందని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలో డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డాడని, కారు నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది( Firefighters ) రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని వెల్లడించింది.
ప్రస్తుతం బోల్తాపడిన కారును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి.ఏది ఏమైనా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి లైక్స్ పొందాలని, లేదంటే ఇతరులను ఇంప్రెస్ చేయాలని, థ్రిల్ పొందాలని చాలామంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు.దీనివల్ల వాళ్లకే కాకుండా ఇతరులకు కూడా ప్రాణహాని కలుగుతుంది.
ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని విలువైన ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.వైరల్ వీడియోను( Viral Video ) మీరు కూడా చూసేయండి.
తాజా వార్తలు