Viral Video : వీడియో: ఇది మామూలు లక్కు కాదు భయ్యా.. క్షణంలోనే మృత్యువు తప్పింది!

ఒక్కోసారి తమకు ఉన్న అదృష్టాన్ని తెలుసుకొని కొందరు ఆశ్చర్యపోతుంటారు.అదృష్టం అంటే కోట్ల ఆస్తి తెచ్చే లక్కు మాత్రమే కాదు.

 Man Luckily Escapes From Car Accident Viral Video,car Accident,man,viral Video,s-TeluguStop.com

ఏం తీసుకెళ్లకుండా ఉండేదే కూడా అదృష్టమే.ముఖ్యంగా అత్యంత డేంజరస్ పరిస్థితిల్లో కూడా ప్రాణాలను నిలిపేదే అసలైన లక్కు.

ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికే ఉంటుంది.కాగా తాజాగా అలాంటి అదృష్టవంతుల్లోనే అత్యంత అదృష్టవంతుడిగా ఒక వ్యక్తి నిలిచాడు.

అతడు మిల్లి సెకన్లలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.అతడు రెండు సెకన్లు ఆలస్యం చేసినా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి.

కానీ లక్ వల్ల అతడు బతికి బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 10 లక్షలు వరకు వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి వాటర్ గన్ పట్టుకొని ఫ్లోర్ క్లీన్ చేయడం చూడవచ్చు.

అయితే అతడికి సూటిగా అటువైపు నుంచి ఒక కారు దూసుకు వచ్చింది.ఇంతలోనే అతడు పక్కకు జరిగాడు.అలా కన్నుమూసి తెరిచేలోగా ఆ కారు అత్యంత వేగంగా వచ్చి అతడి పక్కనే ఉన్న గోడకి డ్యాష్ ఇచ్చింది.ఆ వేగానికి కారు ముందు భాగం ధ్వంసం అయింది.

అదే ఆ యువకుడు అక్కడే ఉన్నట్లయితే నుజ్జునుజ్జు అయిపోయాడు.అదృష్టం కొద్దీ అలా జరగలేదు.

అయితే ప్రాణాలతో బయటపడ్డ అతడు చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరుగులు తీసాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఇది డెస్టినీ, లక్కు అని కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు.

ఈ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube