ఒక యువకుడి తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.కొంతమంది ఆత్మహత్య చేసుకునేందుకు వేగంగా వెళుతున్న సమయంలో పట్టాల మీదకు వెళతారు.
ఇలా ట్రైన్ల కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా చోటుచేసుకుంటాయి.తాజాగా ఒక యువకుడు ట్రైన్ పట్టాల కింద( Train Tracks ) ఖాళీగా ఉండే ప్లేస్‌లో పడుకున్నాడు.
ఈ సమయంలో ట్రైన్ వేగంగా ట్రాక్ మీద నుంచి దూసుకెళ్లింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
యువకుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అభిషేక్ నరేడా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక యువకుడు ట్రాక్, గ్రౌండ్ మధ్య గ్యాప్‌లో నీలంరంగు పడుకున్నాడు.అతడు నీలంరంగు చొక్కా వేసుకుని కనిపించాడు.
బెడ్ మీద పడుకున్నట్లు హాయిగా సేద తీరుతూ పడుకున్నాడు.ఈ సమయంలో ఒక ట్రైన్( Train ) వేగంగా రైల్వే ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లింది.
ఈ సందర్బంగా అతడి స్నేహితులు వీడియోను రికార్డు చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
పాపులర్ అవ్వడానికి ఇలాంటి ప్రమాదకర వీడియోలు చేయడం ఏంటని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అభిషేక్ నరోడా వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రైల్వే పోలీస్ ఫోర్స్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖకు ట్యాగ్ చేశాడు.ఇలాంటి వీడియోలను చేసేటప్పుడు వందసార్లు ఆలోచించాలని తెలిపాడు.ఇలాంటి వ్యక్తులను రైల్వే యాక్ట్ ప్రకారం జైలుకు పంపాలని కోరాడు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.పోలీసులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో పేరు తెచ్చుకునేందుకు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం సరికాదని అంటున్నారు.







