మనీలా దేశం మరో ఘోర ఘటనకు సాక్ష్యంగా మిగిలింది.నూరేళ్ళ జీవితంలో నీ తోడు ఉంటాను అంటూ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఉన్మాదిలా మారి భార్యా పిల్లల్ని కడతేర్చాడు.
విషయం ఏమిటంటే ఫిలిప్సీన్‌లో ఓ వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.లానియోజన్ అనే వ్యక్తి తన భార్య రోలిన్, తన పిల్లలు క్రీసెల్ జోయ్, డోబోంగ్‌లను కత్తితో హతమార్చాడు, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
పోలీసుల కధనం ప్రకారం దాదాపు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు చుట్టూ పక్కల వాళ్ళు.పోలీసులు హుటా.
హుటిన ఘటనా జరిగిన స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే భార్య, పిల్లలు మృతి చెందారు.లానియోజన్ మాత్రం చావుబతుకుల్లో కనిపించారు.
దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.కానీ ఫలితం లేకుండా పోయింది.
వంట గదిలో ఉపయోగించే కత్తితో ఈ ఘాతుకానికి పాలపడినట్లు తెలుస్తుంది.ఇక పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తునకు ఆదేశించారు.






