అఖిల్ 'ఏజెంట్'లో మమ్ముట్టి స్టైలిష్ లుక్.. పిక్ వైరల్!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

Advertisement

ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం అఖిల్ లుక్ ను ఏ విధంగా స్టైలిష్ గా మార్చాడో ఇప్పుడు విలన్ ను కూడా అంతే స్టైలిష్ లుక్ లోకి మార్చినట్టు తెలుస్తుంది.

ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ బుడాపెస్ట్ లో జరుగుతుంది.ఇక్కడ విలన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను సూరీ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ని సూరీ సెలెక్ట్ చేసాడు.అంతేకాదు ఈ సినిమాలో మమ్ముట్టి లుక్ పూర్తిగా మార్చేసి చాలా స్టైలిష్ గా తయారు చేసాడు.ఈ సినిమాకు సంబంధించిన మమ్ముట్టి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

లీక్ అయినా ఫోటో చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమా కోసం మమ్ముట్టి ని సూరీ ఎంతగా మార్చేసాడో.ఈ ఫోటో చుసిన మమ్ముట్టి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఇక ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటి వరకు అఖిల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

మరి చూడాలి ఈ సినిమా అఖిల్ ను మాస్ హీరోగా నిలబెడుతుందో లేదో.

తాజా వార్తలు