ఆ విషయంలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన మల్లెమాల?

బుల్లితెరపై మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం గత పది సంవత్సరాలుగా ప్రసారమవుతు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Mallemala Gave Complete Freedom To Hyper Adi Auto Ramprasad In That Regard, Mall-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో కమెడియన్స్ చేసే స్క్రిప్ట్ కొందరు టీం లీడర్స్ ప్రిపేర్ చేసుకోగా మరికొందరు ఇతరులు చేత స్క్రిప్ట్ సిద్ధం చేయించుకుంటారు.

అయితే టీం లీడర్స్ ముందుగా వారు సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ మల్లెమాల వారి ఆఫీసు నుంచి అప్రూవల్ తీసుకున్న తరువాతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ వంటి వారు సొంతంగా వారి స్క్రిప్ట్ వారి సిద్ధం చేసుకుంటారు.

అందరూ టీం లీడర్స్ లాగా వీరిద్దరూ స్క్రిప్ట్ మల్లెమాల వారికి ఇచ్చి అప్రూవల్ తీసుకోవాల్సిన పనిలేదు.కొందరి స్క్రిప్టును మల్లెమాలవారు వివాదం అవుతుందని లేదంటే ఆ స్క్రిప్టులో వినోదం లేదంటూ మారుస్తూ ఉంటారు.

కానీ ఆటో రాంప్రసాద్ హైపర్ ఆది తయారు చేసుకున్న స్క్రిప్ట్ విషయంలో మల్లెమాలవారు ఎలాంటి మార్పులు చేయరు అలాగే వీరు మల్లెమాల వారి నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన పని కూడా లేదు.

Telugu Auto Ramprasad, Freedom, Hyper Adi, Mallemala-Movie

స్క్రిప్ట్ విషయంలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ కు మల్లెమాలవారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.అయితే వీరి స్క్రిప్ట్ ద్వారా ఎలాంటి వివాదం తలెత్తిన వాటిని పూర్తిగా వారే పరిష్కరించుకోవాలని ఒప్పందం ముందుగా కుదుర్చుకోవటం వల్ల మల్లెమాలవారు వీరి స్క్రిప్ట్ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోరని తెలుస్తుంది.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది చేసిన స్కిట్ లో ఇదివరకు పలు వివాదాలకు కారణమయ్యాయి అయితే హైపర్ ఆది ఈ వివాదాలపై స్పందించి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube