కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల మేరకే అన్ని మతాలకూ ఒక్కటే నిబంధనలు విధించామని భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు నిలదీయల్సింది కేంద్రాన్నేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ నిబంధనలకు సంబంధించి గత నెల 28న కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్లో నాల్గవ లైన్ ఒకసారి చదువుకోవాలని వీర్రాజుకు సూచించారు.
అందులో కేంద్రం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు.బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేదన్నది ఆ పేరా సారాంశంగా ఉందన్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్ని అసత్యాలు చెబుతూ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.కేంద్రం నుంచి రావాల్సిన కరోనా వ్యాక్సిన్లు, ఇతర నిధులు గురించి ఇదే సోము వీర్రాజు ఏనాడు మాట్లాడలేదన్నారు.

కానీ ఇలాంటి విషయంలో మాత్రం తమ హిందూ పక్షపాతిగా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోము వీర్రాజు మాట్లాడే తీరు చూస్తుంటే పోలీసులు హిందువులను అరెస్టు చేస్తారా.అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేశారు.దారినపోయే స్వామిజీలు అందరూ కూడా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికారు.