మాలికాపురం సినిమా గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల మలయాళం లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవడం మాత్రమే కాకుండా భారీగా కూడా కలెక్షన్స్ ను సాధించింది.
ఇందులో నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో వచ్చింది.
కానీ తెలుగులో మాత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
మళయాళం, తమిళం, హిందీ, కన్నడ,తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఓటీటీ లో ఇతర బాషలతో పోలిస్తే తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది.కాగా ఇందులో తన సూపర్ హీరో అయ్యప్పన్ ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది.ఉన్ని ముకుందన్ హీరోగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు.కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే.

ఇందులో నరయం, కున్హికూనన్, మిస్టర్ బట్లర్, మంత్రమోతీరం వంటి చిత్రాలతో ఫేమస్ అయిన దర్శకుడు శశిశంకర్ తనయుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాగా గత నెల 21 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు పలు భాషల్లో భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇక ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ కలెక్షన్స్ సాధిస్తోంది.కాగా ఈ సినిమాలో నటించిన ఉన్నికృష్ణన్ కు మంచి గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే.







