ప్లాప్ వచ్చిన తర్వాత డైరెక్టర్ కు మరో ఛాన్స్ అంటే చాలా చాలా కష్టం.అది కూడా ప్లాప్ డైరెక్టర్ కు స్టార్ హీరో కానీ స్టార్ నిర్మాణ సంస్థ కానీ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అంటే అది ఆషామాషీ కాదు అనే చెప్పాలి.
కానీ ఈ ఇద్దరు దర్శకులకు మాత్రం టాలీవుడ్ లో పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు.వారు మరెవరో కాదు.
వివేక్ ఆత్రేయ, రాధాకృష్ణ కుమార్.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా అంటే సుందరానికి సినిమాను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో పెద్దగా హిట్ అందుకోలేక పోయిన ఈయన మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.
ఈ సినిమా థియేట్రికల్ పరంగా మెప్పించక పోయిన ఓటిటి పరంగా మాత్రం బాగా మెప్పించాడు.దీంతో వివేక్ టాలెంట్ ను మెచ్చిన నాని ఈ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చినట్టు గత రెండు రోజుల నుండి ఒక వార్త వైరల్ అవుతుంది.

వివేక్ ఆత్రేయను ఇటీవలే ఇంటికి పిలిచి మంచి కథ ఉంటే చెప్పమని నాని కోరారట.కానీ వివేక్ కొంచెం టైం తీసుకుని స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డారట.ఇక మరొక డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. జిల్ సినిమాతో యూవీ క్రియేషన్స్ లోకి అడుగు పెట్టాడు.ఈ సినిమాతో హిట్ అందుకుని ఏకంగా రాధేశ్యామ్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు.కానీ ఈ సినిమా విఫలం అవ్వడంతో ఈయన కెరీర్ మొత్తం డౌన్ అయ్యింది అని అనుకున్నారు.

అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం ఆయనని బాగా నమ్ముతుంది.అందుకే మరో సినిమా చేసే అవకాశాన్ని అందించారు అని టాక్.రాధేశ్యామ్ తో కోట్ల రూపాయలు నష్టం తీసుకు వచ్చిన యూవీ మాత్రం రాధాకృష్ణను నమ్మి మరో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుంది అని టాక్.అది కూడా స్టార్ హీరోతో ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందట.
మరి ఇదే నిజమైతే ఇది రాధాకృష్ణకు గోల్డెన్ అవకాశం అనే చెప్పాలి.







