‘స్పార్క్’ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్న మ‌ల‌యాళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హెషమ్ వ‌హాబ్‌

విక్రాంత్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’.ఈ చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించినప్ప‌టి నుంచే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

 Malayalam Music Director, Hesham Abdul Wahab, Will Be Composing Music For Spark-TeluguStop.com

మే నెల‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి కుంటోంది.సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తార‌ని మేక‌ర్స్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

చెప్పిన‌ట్లే హెష‌మ్ వ‌హాబ్‌కు స్పార్క్ సినిమా సంగీత సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ‘హ్రిదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించారు.

హ్రిద‌యం సినిమాలో ప్ర‌తి పాట ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.సూప‌ర్ స్టార్ డ‌మ్‌ను అందుకున్న హెష‌మ్ వ‌హాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ – స‌మంత జంట‌గా న‌టించిన ఖుషి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.ఇప్పుడు స్పార్క్ సినిమాకు కూడా హెష‌మ్ సంగీతాన్ని అందించ‌డానికి ఓకే చెప్పారు.ఎఫ్ 3 వంటి సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ చిత్రం త‌ర్వాత మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్ర‌మిది.హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

త్వ‌ర‌లోనే యూర‌ప్‌లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube