ఆ సాంగ్ రీమేక్ చేసి పాడుచేయకండి అంటున్న మలైకా అరోరా

ఈ మధ్యకాలంలో ఒకప్పటి క్లాసిక్ సాంగ్స్ ని విపరీతంగా రీమేక్ చేసి దానికి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం హీరోలు సంగీత దర్శకులు చేస్తున్నారు.

అయితే ఇలా చేస్తున్న ప్రయోగాలు చాలా వరకు విఫల ప్రయత్నం అవుతున్నాయి.

రీమేక్ చేసిన సాంగ్స్ ఒరిజినల్స్ దరిదాపులలోకి రావడం లేదు.అదే సమయంలో ఒరిజినల్ సాంగ్స్ కి ఉన్న గుర్తింపు ఈ రిమేక్స్ వలన దెబ్బ తింటుంది.

ఈ విషయం మీద ఈ మధ్యకాలంలో ఇళయరాజా, ఎ ఆర్ రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ దర్శకులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు కూడా.తమ పాటలని రీమేక్ చేసి కూనీ చేయొద్దని కోరుతున్నారు.

ఇక బాలీవుడ్ లో కూడా ఈ రీమేక్ సాంగ్స్ ప్రహసనం నడుస్తుంది.అయితే ఈ పద్ధతి కరెక్ట్‌ కాదని ఒకప్పటి బాలీవుడ్‌ నటి మలైకా అరోరా అంటుంది.

Advertisement

క్లాసిక్‌ పాటల్ని రీమిక్స్‌ చేయడం అంటే పాడు చేయడమే అనే అభిప్రాయం వ్యక్తం చేసింది.మా చయ్య చయ్య చయ్యా చయ్యా ఛల్‌ చయ్య సాంగ్ కూడా క్లాసిక్ సాంగ్స్ లో ఒకటిగా ఉంది.

దయచేసి ఎవ్వరూ ఆ పాటను రీమిక్స్‌ చేయొద్దు అని మలైకా కోరింది.ఇక ఈ క్లాసిక్ సాంగ్ కి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మరి టబుతో ఈ పాటని రీమేక్ చేయాలని అనుకుంటున్నారు.దీనిపై ఈ స్టార్ సంగీత దర్శకుడు ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు