వైరల్: వందే భారత్‌ రైళ్లను ఎలా తయారు చేస్తున్నారో చూశారా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఎక్కడుందంటే మన భారత్‌ లోనే.అయితే వేగం, సౌకర్యాల పరంగా భారత్ రైల్వేవ్యవస్థ( Indian Railways ) ఇంకా మెరుగుపడాల్సి ఉందనే సంగతి అందరికీ తెలిసినదే.

 Making Of Vande Bharat Trains In Integral Coach Factory Icf Chennai Details, Vir-TeluguStop.com

ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందే భారత్‌ రైళ్లను( Vande Bharat Trains ) ఇటీవలకాలంలో ప్రవేశ పెట్టింది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 75 రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.

తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్‌- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి మోడీ( PM Modi ) ప్రారంభించిన సంగతి విదితమే.కాగా ప్రస్తుతం ఈ రైళ్లకు మంచి స్పందన వస్తోంది.

Telugu Icf Chennai, Integralcoach, Vandebharat, Latest-Latest News - Telugu

అలా ఇప్పటి వరకు 17 రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది.అయితే, ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం విశేషం.చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ రైళ్లను తయారు చేస్తున్నారు.ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యక విభాగం పనిచేస్తుంది.ప్రస్తుతం వందే భారత్‌ రైలు ఇంజిన్‌ నుంచి కోచ్ వరకు పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని అక్కడివారు చెబుతున్నారు.సాధారణ రైళ్లలో 24 కోచ్‌లు ఉంటాయి.

అదే వందేభారత్‌లో కేవలం 16 బోగీలు మాత్రమే ఉంటాయి.కార్లు, సహా ఇతర వాహనాలను తయారుచేసినప్పుడు తొలుత ఫ్రేమ్‌ను సిద్ధం చేస్తారు.

అలాగే వందే భారత్‌ రైళ్లను తయారుచేస్తున్నప్పుడు కూడా తొలుత ఫ్రేమ్‌ను తయారుచేస్తారు.

Telugu Icf Chennai, Integralcoach, Vandebharat, Latest-Latest News - Telugu

ఆ తరువాత ఫ్రేమ్‌పై ఇతర నిర్మాణాలు అనేవి చేపడతారు.అదే సమయంలో మరో బృందం రైలు కోచ్‌ సైడ్‌ వాల్స్‌ను సిద్ధం చేస్తుంది.ఆటోమేటిక్‌ రోబోట్‌ లేజర్‌ టెక్నాలజీని ఇందుకోసం వినియోగిస్తారు.

వెల్డింగ్‌ పని పూర్తియిన తర్వాత కోచ్‌ సైడ్‌ వాల్‌కు రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు.అన్ని పరీక్షలు పాస్‌ అయితేనే అసెంబ్లీ లైన్‌కు వాటిని పంపించడం జరుగుతుంది.

అనంతరం కూడా కొన్ని వెల్డింగ్‌ పనులు ఉంటాయని ఫ్యాక్టరీ కార్మికులు చెబుతున్నారు.అదేవిధంగా సీట్ల ఫిక్సింగ్ చేయడం, హ్యాంగర్లు.

కోచ్‌ పూర్తి ఆకారం వచ్చాక అమర్చబడతాయి.ఈ పనులు అన్ని ముగిశాక పెయింటింగ్‌కు పంపిస్తారు.

పెయింట్‌ పని పూర్తయ్యాక ఇంజిన్‌, సీట్లు, ఇతర ప్యానల్లను అమర్చే పని ప్రారంభిస్తారు.ప్రస్తుతం దానికి సంబందించిన వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube